రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దిశ పటని ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా , బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాకూర్ , శోభనమూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు.

విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , దుల్కర్ సల్మాన్ ,  అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ..  వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని నిర్మించింది. ఇకపోతే ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే తొమ్మిది రోజులు పూర్తి అవుతుంది. ఇక తొమ్మిదవ రోజు కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 నుండి 5.50 కోట్ల మేర షేర్ కలెక్షన్లు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇవి కాస్త పెరిగిన పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. లేకపోతే వీక్ డేస్ లోనే ఈ మూవీ సూపర్ సాలిడ్ హోల్డ్ ను కనబరుస్తోంది. మరి హాలి డేస్ లో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లు కాబట్టి అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: