తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన డబల్ ఈస్మార్ట్ అనే సినిమాను కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ కావ్య దపర్ హీరోయిన్గా కనిపించనుండగా , డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ కలైకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.  

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి అయినట్లు తెలియ జేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడం , ఈ మూవీ విడుదల తేదీ కూడా దగ్గరకు రావడంతో ఈ మూవీ బృందం చాలా స్పీడ్ గా ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ బృందం దేశ వ్యాప్తంగా ఈ సినిమా యొక్క ప్రమోషన్లను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. అందుకే ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను దేశ వ్యాప్తంగా ఈ మూవీ బృందం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: