కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది పర్వాలేదు అనే స్థాయికి వెళుతున్న ఓ ఇద్దరి హీరోయిన్ల స్థాయికి మాత్రం ఎవరు కూడా వెళ్లలేకపోతున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు ..? వారికి ఎందుకు అంత క్రేజ్ అనే వివరాలను తెలుసుకుందాం. కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో నయనతార , త్రిష ప్రథమ స్థానంలో ఉంటారు. వీరిద్దరూ ప్రస్తుతం తమ కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు. వీరి ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలమే అవుతున్న కొత్త వాళ్లకు కూడా సాధ్యం కాని స్థాయిలో సినిమాలను చేస్తున్నారు.

ఇక వీరిద్దరు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీ మణులుగా కెరియర్ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఒక్కో మూవీ కి దాదాపు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి స్థాయిలో కోలీవుడ్ లో మరే బ్యూటీ కూడా పారితోషకం తీసుకోవడం లేదు అని తెలుస్తుంది. అలాగే వీరి దరిదాపుల్లో కూడా వేరే ఎవరూ లేరు అని సమాచారం. మరి ఎందుకు వీరిద్దరికీ అంతా క్రేజ్ అనే విషయానికి వస్తే ... వీరి వయస్సు పెరిగినా కానీ అందం ఏ మాత్రం తగ్గకపోవడం. అలాగే వీరి కన్నా తక్కువ వయసు ఉన్న హీరోల పక్కన కూడా వీరు అందంగా కనిపించడం.

అలాగే వీరు నటిస్తున్న సినిమాలు కూడా వరుసగా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉండడం. ఈ కారణాలతో పాటు మరికొన్ని కారణాల వల్ల కూడా వీరికి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ ఉంది. ఇకపోతే వీరిద్దరూ కూడా తమిళ్ , తెలుగు సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారే కానీ ఆ తర్వాత వీరు తెలుగు సినీ పరిశ్రమను పక్కన పెట్టేసి కేవలం తమిళ్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టడం మొదలు పెట్టారు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: