టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయి ఉన్న దర్శకులలో నాగ్ అశ్విన్ ఒకరు. ఈయన తాజాగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ స్థాయిలో అద్భుతమైన కలక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా సూపర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇందులో కూడా అనేక మైనస్ పాయింట్లు ఉన్నాయి. అలాగే కొన్ని తప్పులను కూడా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో నాగి చేశాడు. సినిమా ఆడేస్తోంది  కదా... నేను ఏ తప్పులు చేయలేదు.

ఎవరైనా ఏమైనా తప్పులు చూపిస్తే మీకు సినిమా చూడడం రాదు అని అనకుండా నాగి వాటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుంటున్నాడు. అలాగే ఎవరైనా తప్పులు చేశారు అంటే వాటిని స్వీకరిస్తూ వాటికి జవాబులు చెబుతున్నాడు. ఈ సినిమా రన్ టైమ్ లో ఎక్కువ శాతం అమితాబ్ కనిపించడంతో ప్రభాస్ అభిమానులే నాగి పై ఎందుకు ఇలా చేశారు. ఇది ప్రభాస్ సినిమానా లేక అమితా బచ్చన్ సినిమానా అని అడిగిన వారు ఉన్నారు. దానిపై నాగి స్పందిస్తూ ... ఈ కథ చాలా పెద్దది. ముందు కథ ప్రారంభం అవ్వాలి అంటే ఒక వ్యక్తి నుండి కావాలి. అలా కావాలి అంటే ముందుగా వేరేవాళ్లను చూపించాలి. అందుకే అమితాబ్ గారిని ఎక్కువగా టైమ్ చూపించాల్సి వచ్చింది అని సమాధానం ఇచ్చాడు.

అలాగే ఈ సినిమాలో కుప్పలు తేప్పలుగా అనేక మంది క్యామియో పాత్రలు ఉన్నాయి. అందులో రామ్ గోపాల్ వర్మ పాత్ర  ప్రేక్షకులను ఆకట్టుకున్న అది సినిమా కథకు ఏ మాత్రం సంబంధం లేదు. అలాగే రాజమౌళి , అనుదీప్ కేవి కూడా ఈ సినిమాలో కనిపించిన వారితో కూడా ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. దీని విషయంలో కూడా ప్రేక్షకుల నుండి నెగటివ్ స్పందనలు వస్తున్నాయి. అవసరం లేని పాత్రలు ఎందుకు ..? అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి వాటిపై కూడా నాగి వర్క్ చేయనున్నట్లు కల్కి రెండవ భాగంలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: