నటి ఇలియానా గురించి తెలియని తెలుగు కుర్రకారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. ఆమె నడుము ఒంపుల్ని టాలీవుడ్ అంత త్వరగా మర్చిపోదు. తెలుగులో దేవదాస్ సినిమాతో పరిచయమైన ఇల్లు బేబీ సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి సినిమాతో స్టార్ క్రేజ్ దక్కించుకొని తెలుగుని కాదనుకొని బాలీవుడ్ చెక్కేసింది. ఆ తరువాత ఆమె నట జీవితం తలకిందులైందనే చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులు ఆమెకి బ్రహ్మరధం పడుతున్నారు అనే సమయంలో బాలీవుడ్ చెక్కేయడంతో ఇక్కడ ఆమెకి సినిమా అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. అటు బాలీవుడ్లో కూడా ఆమె చేసిన ఒకటి ఆరా సినిమాలు ఆమెకి ఏ రకంగానూ కలిసి రాలేదు. దాంతో ఆమె పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టి పెళ్లి చేసుకొని ఏకంగా ఓ బిడ్డకు తల్లి అయింది.

కాగా ఈ ముద్దుగుమ్మ ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. విషయం ఏమిటంటే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె ఇపుడు కొంతకాలంగా బోల్డ్ ఫోటో షూట్ అంటూ రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది. ఆయా ఫోటోలను చూసిన అభిమానులు సరదా పడినప్పటికీ... "నీ అందం పాడుగాను... నీ యవ్వనం అడవి కాచిన వెన్నెల అయిపోయిందే..! అంటూ నిట్టూర్పుగా కామెంట్స్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఇల్లు బేబీ మునిపటి కంటే బొద్దుగా తయారైంది. దాంతో ఆమె అభిమానులు కాస్త దిగులు చెందుతున్నారు. మరోవైపు కొందరు కొంటె కుర్రాళ్ళు బేబి నువ్వు ఎంత రెచ్చిపోయినా..  నిర్మాతలు పడరులే... కాలం మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విషయం ఏదైనా ఇక్కడ ఇల్లు బేబీ ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఆమె తప్పటడుగులు వేసింది అనేది నగ్న సత్యం. తెలుగు పరిశ్రమలో ఉండుంటే ఆమె అదృష్టం వేరేలా ఉండేది. ఇపుడు తెలుగు సినిమా ప్రపంచ సినిమాని శాసిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు హిందీ సినిమాల కోసం సౌత్ సినిమాలను నెగ్లెక్ట్ చేసింది. ఫలితంగా అమ్మడు అక్కడ స్టార్ రేంజ్ అందుకోలేదు సరికదా సౌత్ సినిమా ఆఫర్లను ఎన్నింటినో మిస్ చేసుకుంది. ఐతే తిరిగి మళ్లీ తెలుగు ఆఫర్ల కోసం ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇపుడు ఇలియానా తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే గురి పెట్టుకుని కూర్చుకుంది. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది ఇలియానా.

మరింత సమాచారం తెలుసుకోండి: