ఈ క్రమంలో అది చాలాదన్నట్టు... మరో బుద్ధిబండ అతని నెత్తి మీద పడింది. ఇప్పుడు అదే విషయం గత రెండు మూడు రోజులుగా మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక విషయం ఏమిటంటే... రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అతనిపై పోలీసు కేసు పెడుతూ, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ కి అక్రమ సంబంధం ఉందని, దాంతోనే తనని కొన్నాళ్లుగా దూరం పెడుతున్నాడని ఆమె ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసింది. ఇక ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితులలో హీరో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి తన గోడుని వెలబుచ్చుకున్నాడు.
రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ... తన ప్రియురాలు లావణ్య తనపై అసత్య ప్రచారాలు చేస్తోందని వాపోయాడు. మొదట్లో చాలా బాగుండేదని, ఆ తర్వాత కాలంలో చాలా తేడాగా తయారైందని చెప్పుకొచ్చాడు. విషయం ఏంటని సదరు యాంకర్ అడగగా... మస్తాన్ అనే వ్యక్తి రాకతో తన పర్సనల్ జీవితం ముక్కలైందని కన్నీరు కారుస్తూ లబోదిగోమని ఏడ్చాడు రాజ్ తరుణ్. ఇక విషయం ఆ పరమేశ్వడికి ఎరుక గాని... ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ అభిమానులు తీవ్రమైన మనస్థాపంతో తమ హీరోకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో తమ బాధని కామెంట్ల రూపంలో రాసుకున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని ఎక్కడ కామెంట్ల రూపంలో తెలుపగలరు.