పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలుగులో రూ. 24.1 కోట్లు, హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో ఏకంగా రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. 


అలాగే అర్జునుడి ‘గాండీవం’ చాలా ఈజీగా విలన్ చేతిలోకి వెళ్తుంది.ఇక దీనివల్ల సెకండ్ పార్ట్ లో విలన్ అయిన కలి గాండీవంతో యుద్ధం చేస్తే ప్రభాస్ కర్ణుడిగా అసలు పోరాటం చేస్తాడా? అసలు కర్ణుడికి కల్కి ఎంట్రీ కి అసలు సంబంధం ఏముంది. పురాణాల్లో ఎక్కడ కూడా కల్కి వచ్చే సమయంలో కర్ణుడు ఎంట్రీ ఇస్తాడని రాసి లేదు. మరి ఎందుకు వీళ్ళు కల్కి సినిమాలో కర్ణుడిని ఎందుకు చూపించారు. అయితే ఇక సెకండ్ పార్ట్ లో కర్ణుడు అర్జునుడు కంటే గొప్పవాడు అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిజానికి మహాభారతంలో జరిగిన ఎపిసోడ్ ని యాజ్ ఇట్ ఇజ్ గా తీయకుండా ఫిక్షన్ స్టోరీలను రాసుకొని సినిమాను తీస్తున్నారు అంటూ చాలా సినీ విమర్శకులు సైతం నాగ్ అశ్విన్ మీద ఫైర్ అవుతున్నారు.కురుక్షేత్రం జరగడానికి కారణమైన కర్ణుడి ని హీరోగా చేసి చూపించాలని ఎలా అనిపించింది. అంటూ వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. మరి కల్కి 2 సినిమా స్టోరీ మార్చే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నాడా? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: