మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఎంతో భారీ బడ్జెట్ తో , చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకు అనుగుణం గానే ఈ సినిమా షూటింగ్ ను కూడా చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. అలాగే ఈ మూవీ యొక్క డబ్బింగ్ పనులను కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యొక్క చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఒక భారీ సెట్ లో జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి అనేక లోకాలను ప్రయాణించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక లోకంలో ఏలియన్స్ తో కూడా ఉండవలసిన అవసరం వస్తుందట. ప్రస్తుతం ఆ సన్నివేశాలనే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక చిరంజీవి , ఏలియన్స్ మధ్య ఒక అద్భుతమైన కామెడీ ట్రాక్ ను ఈ సినిమా దర్శకుడు వశిష్ట ప్లాన్ చేస్తున్నట్లు , ప్రస్తుతం ఆ కామెడీ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి , ఏలియన్స్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతానికి విశ్వంబర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: