యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హిందీ నుంచి రూ. 171.9 కోట్లు, కన్నడ నుంచి 3 కోట్లు, మలయాళం ద్వారా రూ. 14.9 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఓవర్ సీస్ లో దాదాపు 175 కోట్ల వసూళ్లు వచ్చాయి. దాంతో కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లోనే ఏకంగా రూ. 800 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.


ఇదిలా ఉంటే కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. దాంతో అంచనాలు పెరిగాయి. అందువల్ల పార్ట్ 2 అంచనాలకి తగ్గట్టు రెడీ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.పైగా కల్కి 1 సినిమాలో  క్యామియో పాత్రలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో..విజయ్ దేవరకొండను అర్జునుడి పాత్రలో చూపించారు. ఈ పాత్ర కి మంచి ఆదరణ లభించింది. అయితే, కల్కి 2 లో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందా.. లేదా.. అనేది హాట్ టాపిక్ గా మారింది.


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో..విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుంది. కల్కి 2898 ఏడి లో కూడా ఉంది. మరి కల్కి 2 లో ఉండాలి అంటే విజయ్.. అర్జునుడు.. కాబట్టి మళ్ళీ మహాభారతం ఎపిసోడ్ పెట్టి.. అందులో విజయ్ ని క్యామియో గా చూపించాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ రోల్ ని గూస్ బంప్స్ వచ్చేలా తెరకేక్కిస్తున్నాడట నాగ్ అశ్విన్. ఫస్ట్ పార్ట్ లో విజయ్ రోల్ పై నెగటివిటీ రావడంతో సెకండ్ పార్ట్ లో ప్రభాస్ కి ధీటుగా విజయ్ కి ఎలేవేషన్ సీన్స్ ప్లాన్ చేసాడట. దీంతో కల్కి 2 పై ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: