ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలే భారీ విజయాలను సాధిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధించిన మూవీస్ లో హనుమాన్ మూవీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. మైథాలజీ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా అన్నివర్గాల ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించగలిగింది.


 ప్రశాంత్ వర్మ తన డైరెక్షన్ టేకింగ్ తో మరోసారి ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులను చేయడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వల్ గా జై హనుమాన్ అనే మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సీక్వెల్ మూవీలో హనుమాన్ పాత్రను తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హనుమాన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. చిరంజీవి అయితేనే హనుమాన్ పాత్రలో బాగుంటాడని ఎంతోమంది అభిప్రాయం. తాను కూడా మెగాస్టార్ ను ఊహించుకొని హనుమాన్ పాత్రను డిజైన్ చేశాను అంటూ గతంలో ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.


 అయితే ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో హనుమాన్ పాత్రధారిని తప్పకుండా చూపించాల్సిందే   దీంతో ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలి అనే ఆలోచనలోనే ప్రస్తుతం చిత్ర బృందం పడిందట. అయితే చిత్ర నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి హనుమాన్ పాత్రకు ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పారట. నా పర్సనల్ ఛాయిస్ ప్రకారం రామ్ చరణ్ అని చెప్పారట. అయితే హనుమాన్ పాత్రలో చిరంజీవి గారు కూడా బాగుంటారు అని సలహా ఇచ్చారట. ఈ ఇద్దరిలో ఎవరు చేసిన అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారట. కాగా ఈ సినిమా భారం మొత్తాన్ని ఇక హనుమాన్ పైనే వదిలేసామని.. ఎవరి ద్వారా ఈ కథ చెప్పాలని అనుకుంటారో అంతా హనుమంతుల వారు చూసుకుంటారు అంటూ ఇక ఇలా ప్రొడ్యూసర్లలో ఒకరైన చైతన్య చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: