సినీ ఇండస్ట్రీలో పట్టుదల క్రమశిక్షణకి మారుపేరు ఏఎన్ఆర్.. ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే కచ్చితంగా వాటిని నేర్చుకునే వరకు నిద్రపోరని చాలామంది నటీనటులు సైతం తెలియజేస్తూ ఉండేవారు. ఎన్నో సాంఘిక చిత్రాలకు సైతం పనికిరాడు అన్నవారే ఆ తర్వాత ఆయనతో కలిసి సినిమాలు తీయడానికి లైన్ లో నిలబడే వారట. నటుడుగా తన కెరీర్నే ప్రారంభించిన ఏఎన్ఆర్.. మొదట్లో ఏఎన్ఆర్ కు ఎదురైన అవమానాలే విజయానికి అడుగులు వేయించేలా చేశాయి. అలా తనని అవమానించిన వారికి కూడా స్నేహ హస్తం చాచి మంచితనాన్ని చాటుకున్నారు ఏఎన్ఆర్.


డైరెక్టర్ పి పుల్లయ్య దర్శకత్వంలో నటించిన ప్రాణమిత్రులు సినిమా 1967లో విడుదల అయింది
ఈ చిత్రానికి నిర్మాత వెంకటేశ్వర్లు అయిన సూర్యనారాయణ అనే ఆయన బాధ్యతలను సైతం ఎక్కువగా చూసుకునే వారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వరరావు సినిమా సేట్టుకి రమ్మని చెప్పి డైరెక్టర్ పి పుల్లయ్య సూర్యనారాయణకు కబురు చెప్పారట. దీంతో అక్కినేని మేకప్ రూమ్ వరకు వెళ్లారట. అక్కడ మేకప్ వేసుకుంటున్న ఏఎన్ఆర్ ను చూసి.. గుమ్మం దగ్గరే నిలబడిన సూర్యనారాయణ ను చూసి.. ఏం సూర్యనారాయణ గారు అని అడగగా మేకప్ సిద్ధమైపోతే సినిమా షూటింగ్ కి వచ్చేయమని డైరెక్టర్ పిలిచారని చెప్పారట.


లోపలికి రమ్మని చెప్పి ఏఎన్ఆర్ ఇలా మాట్లాడుతూ ముగ్గురు మరాఠీలు సినిమాని 1946లు చేస్తున్న సమయంలో మీరు మేనేజర్ గా పని చేశారు కదా ఆ విషయం తనకు చాలా జ్ఞాపకం ఉందని.. ముఖ్యంగా మేకప్ రూమ్ లో కన్నాంబ గారు ,సుబ్బారావు గారు అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు. తాను కూడా భోజనం కోసం వెళితే గుమ్మం దగ్గర ఉన్న మీరు నన్ను అరసి పంపించారని తెలిపారు.. దీంతో ఈ విషయం తనకి చాలా అవమానంగా ఫీల్ అయ్యానని.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మిమ్మల్ని తిడతాను అనుకోకండి మీ డ్యూటీ మీరు చేశారు తప్ప అందులో అవమానం ఏమీ లేదని.. నేను అవమానంగా బాధపడ్డాను గనకే ఆ సంఘటనను మర్చిపోలేకపోయానని తెలిపారు ఏఎన్ఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: