మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితం ప్రారంభం అయ్యి నిన్నటితో రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. ఈ మూవీ కోసం చరణ్ ఎన్ని రోజులను కేటాయించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గేమ్ చేజర్ మూవీ 2021 వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ నిన్న అనగా 2024 జులై 6 వ తేదీన కంప్లీట్ అయింది.

దీనితో మొత్తం రామ్ చరణ్సినిమా కోసం 2 సంవత్సరాల 10 నెలలు టైమ్ కేటాయించాడు. ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో ఒక్క సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వం మీద ఉన్న నమ్మకంతో , సినిమా మీద డెడికేషన్ తో ఒకే సినిమా కోసం ఎన్ని సంవత్సరాలను కేటాయించాడు. మరి ఇన్ని సంవత్సరాలైనా కేటాయించినందుకు ఈ సినిమాతో కనుక రామ్ చరణ్ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోకపోతే ఆయన కెరియర్ కు చాలా డ్యామేజ్ జరిగినట్లు అవుతుంది.

ఇక ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదల చేసే ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉన్నట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి చరణ్ ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: