ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిన్నటితో ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ. 200 కోట్లు నెట్ ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. 


ప్రభాస్ కాకుండా సౌత్ లో మరే హీరో సినిమా రెండోసారి రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టలేదు. సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. ఇక బాహుబలి 2 సినిమా ఏకంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్ 2 సినిమా దాదాపు రూ. 430 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీలో రూ. 245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. బాహుబలి 2 సినిమా తర్వాత రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి. కల్కి కి ఉన్న దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్ లో పలు రికార్డులు సృష్టించడం ఖాయం లా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: