పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కలిసి అకీరా ఎంట్రీకి ప్రణాళికలు వేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అకీరా ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. మ్యూజిక్ నేర్చుకున్నాడు. సినిమా మీద అవగాహన ఉంది. రానున్న ఒకటి రెండేళ్లలో అకీరాని సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో మహేష్ బాబు. మరి ఆయన వారసుడు ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు. గౌతమ్ సైతం టీనేజ్ దాటేశాడు. గౌతమ్ చదువు కూడా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. కాకపోతే తండ్రి మాదిరే గౌతమ్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు . మోక్షజ్ఞ, అకీరా లతో పాటు గౌతమ్ హీరో అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.
మరి మోక్షజ్ఞ, అకీరా, గౌతమ్ లలో ముందుగా స్టార్ అయ్యేది ఎవరు? ఇండస్ట్రీని ఏలేది ఎవరు?.. చెప్పాలంటే, ఈ ముగ్గురికి సమాన అవకాశాలు ఉన్నాయి. భారీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యాన్ బేస్ వారి సొంతం. ఇక ఎవరు రాణిస్తారు అనేది వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతటి సపోర్ట్ ఉన్నా... టాలెంట్ లేకపోతే ఎక్కువ కాలం నిలబడరు. అభిమానులు కూడా కొంత కాలమే మోయగలరు. నటన, డాన్స్, డైలాగ్స్ వంటి కీలక అంశాల్లో నైపుణ్యం చూపించిన వారు స్టార్ అవుతారు.