కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర  ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. ఇక బాహుబలి 2 సినిమా ఏకంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్ 2 సినిమా దాదాపు రూ. 430 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీలో రూ. 245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.


ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి. బాహుబలి 2 రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇది రూ.865 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్‌ రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్‌. అయితే కల్కి సినిమాకి పూర్తిగా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా 1000 కోట్ల మైలు రాయి దాటాలి. అప్పుడే ఈ సినిమా హిట్ కి ఓ అర్ధం ఉంటుంది. ఇక సినిమా 3 వ వారంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వారంలో రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ దాటాలి. లేకుంటే చాలా కష్టం. ఈ సినిమాకి ఇంకో 135 కోట్లు వస్తే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. మరి చూడాలి ఈ వారంలో 1000 కోట్లు దాటుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: