కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర  ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.ఇక నైజాం ఏరియాలో దీనికి ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా అక్కడ ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే రూ. 65 కోట్ల టార్గెట్‌ను చేరుకుని లాభాల్లోకి వచ్చేసింది.అక్కడ ప్రభాస్‌కు ఎక్కువ మార్కెట్ బాగా ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే ఎక్కువ స్క్రీన్లలో ఇది విడుదలైంది. ఫలితంగా ఈ సినిమాకు నైజాంలో ఇప్పటి వరకూ రూ. 73 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.దీంతో ఈ గడ్డపై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. అదే సమయంలో వరుసగా రెండు సార్లు రూ. 70 కోట్లు షేర్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సాధించాడు. గతంలో ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' చిత్రంతో నైజాంలో రూ. 71.40 వసూలు చేసి రికార్డ్ కొట్టాడు.ఇదిలా ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. 


ఆదివారం నాడు ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ. 200 కోట్లు నెట్ ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.  ప్రభాస్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటిన మూవీస్‌గా నిలిచాయి. బాహుబలి 2 రూ.1814కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఇది రూ.865 కోట్లు వసూలు చేసింది. బాహుబలి ` రూ.630 కోట్లతో మూడో స్థానంలో ఉంది. `సలార్‌ రూ.623కోట్లతో మూడో స్థానంలో ఉండగా, నాలుగు సినిమాలకు రూ.500కోట్లకుపైగా కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రభాస్‌. ఇదిలా ఉంటే అమెరికాలో కల్కి రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆర్ ఆర్ ఆర్, జవాన్ రికార్డులని మడత పెట్టేసిన కల్కి పఠాన్ రికార్డులకు బ్రేక్ చేయడానికి కొద్ది దూరంలో ఉంది. ఇప్పటిదాకా కల్కి అమెరికాలో 15.50 మిలియన్ డాలర్ల హిస్టారికల్ మార్క్ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: