ఏపీలో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత ఇపుడిపుడే చిన్నగా పార్టీ అధినేత అలాగే మాజీ మంత్రులు,నేతలు ఓటమి బాధలోనుండి బయటకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం వైస్సార్ కుటుంబంలో మరల కొత్త చర్చ అన్న, చెల్లి మధ్య మొదలైంది అదే దివంగత నేత వైస్సార్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు దాంతో ఎవరికి వారే తగ్గేదేలేదంటూ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహించడానికి సిద్ధం అయ్యారని తెలుస్తుంది.దానికి సంబంధించి ఇప్పటికే  జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో  వైసీపీ, షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాజన్న జయంతి కార్యక్రమాల జరుపడానికి వారి వారి నేతలకు సమాచారం అందించాయి.వైస్సార్ కుటుంబీకులు అందరు కలిసి ఉన్నప్పుడు వైస్సార్ జయంతి నాడు అందరు కలిసి స్వగ్రామం వెళ్లి అక్కడ ఆయన సమాధి దగ్గర బసచేసి ప్రార్ధన చేసేవారు. కానీ వాళ్ళ కుటుంబ కలహాలు కారణంగా ప్రస్తుతం జగన్ అలాగే షర్మిల ఎవరికి వారే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్లి సంతాపం తెలిపి, ప్రార్థనలు చేసేవారు.

అయితే మొదట్లో సోదరుడు జగన్ తో షర్మిల విభేదించిన కారణంగా ఆమె తెలంగాణ రాజకీయాల్లోఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ కాలేకపోయారు. దాంతో ఆమె ఆంధ్రప్రదేశ్లోకి మకాం మార్చవలసి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఏపీ లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా జగన్ కు మైనస్ లాగా మారింది.ఈ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.ఆమె ప్రచారంలో మాజీ సీఎం జగన్ ను సొంత నియోజకవర్గంలోనే బాగా విమర్శించి మాట్లాడారు. అదికూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా నిలిచింది.గత ఎన్నికల్లో వైస్ జగన్ ఎంతటి విజయం సాధించారో అదే విధంగా ఘోర పరాజయం ఈ ఎన్నికల్లో దక్కించుకున్నారు.కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యారు.

ఈవిధంగా అన్న, చెల్లి ఘోర ఓటమితో బాధ పడుతున్న తరుణంలో తల్లి విజయమ్మ వీరిద్దరికి నచ్చచెప్పి విభేదాలు పోగొడతారని శ్రేయోభిలాషులు అంటున్నారు.అయితే ఈనెల 8న రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజునైనా అన్న, చెల్లి కలుస్తారేమోనని భావిస్తున్న టైములో మరల దానికి భిన్నంగా అన్న, చెల్లి నువ్వా నేనా అన్న రీతిలో వేర్వేరుగా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహించాలని చెప్పింది.ఇడుపులపాయలో జరిగే జయంతి వేడుకల్లో జగన్ పాల్గొంటారని తెల్సింది.మరోవైపు వైఎస్ షర్మిలా కూడా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు భారీగా నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు.అయితే ఈ జయంతి వేడుకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తదితరులు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: