తలైవాతో అస్సలు నటించనన్న తలైవి? ఎందుకంటే?   

బాలీవుడ్ లెజెండరి హీరో అమితాబ్‌ బచ్చన్ నటించిన ‘డాన్‌’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ అనే పేరుతో రీమేక్‌ చేశారు. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980 వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.అయితే ఇందులో ముందుగా హీరోయిన్ పాత్రకు మొదట దివంగత తమిళ నాడు ముఖ్య మంత్రి ఇంకా నటి అయిన జయలలితనే అనుకున్నారట. అసలు ఆమెని బిల్లా సినిమాకి హీరోయిన్ గా అనుకొన్న విషయం, ఆమె అందుకు తిరస్కరించిన వైనం చాలామందికి కూడా తెలీదు. అయితే ఈ విషయాన్ని జయలలితే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించడం జరిగింది. 1980 మే 25 నాటి ‘సండే’ పత్రికలోని ‘ఖాస్‌బాత్‌’ శీర్షికలో జయలలిత మళ్లీ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు రాయడం జరిగింది.


అయితే దానిపై జయలలిత కోపానికి గురయ్యి ఘాటుగా స్పందిస్తూ ఆ పత్రికకు ఓ లేఖని రాశారట."రజనీకాంత్‌ హీరోగా నిర్మాత బాలాజీగారు నిర్మించిన ‘బిల్లా’ సినిమాలో హీరోయిన్‌గా నటించమని మొదట నన్నే అడిగారు. కానీ హీరోయిన్ గా నేను కాదన్న తర్వాతే శ్రీప్రియను బుక్‌ చేశారు. కళ్లు చెదిరే పారితోషికం కూడా ఆఫర్‌ ఇచ్చినా నేను ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమా కెరీర్‌ మీద నాకు ఆసక్తి అనేది సన్నగిల్లింది. కానీ ఆ దేవుడి దయవల్ల నేను బాగానే సంపాదించాను. ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా బాగానే ఉన్నాను. అలాగే నా మిగిలిన జీవితంలో కూడా నేను మహారాణిలా బతకగలను’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు జయలలిత. తాను చెప్పినట్లుగానే ఆవిడ తదనంతర కాలంలో మహారాణిలానే బతికారు. తమిళ నాడుకి తిరుగులేని ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించి తమిళ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు జయలలిత.

మరింత సమాచారం తెలుసుకోండి: