పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచ స్థాయిలో వసూళ్ల విషయంలో దుమ్ము లేపుతోంది అని చెప్పాలి. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్  మూవీ గా వచ్చిన సినిమా కావడంతో ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను చూడడం కోసం బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఒకటికి రెండుసార్లు సరిగా చూస్తున్నారు. అలాగే నార్త్ అమెరికా హిందీ వంటి భాషల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది కల్కి. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గా భారీ విజయాన్ని

 అందుకుంటుంది. అయితే మొత్తంగా తొమ్మిది రోజుల్లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ క్రాస్ చేసేసింది కల్కి సినిమా. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా ఇంకా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల బిజినెస్ రిలీజ్ అవ్వగా ఇప్పటివరకు 146 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. మరి ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఆంధ్రాలో 12 కోట్ల వరకు రికవరీ కావాలి. ప్రస్తుతం అక్కడ కల్కి జోరు అయితే తగ్గిందని చెప్పాలి. సీడెడ్ లో 27

 కోట్ల బిజినెస్ కల్కి మూవీపైన జరిగింది. అయితే ఇప్పటి వరకు వరకు 16.68 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అడ్వాన్స్ బేస్డ్ గా రాయలసీమ, ఆంధ్రాలో కల్కి 2898ఏడీ రిలీజ్ చేశారు. దీంతో మూవీపైన వచ్చిన లాస్ ని నిర్మాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్న లాంగ్ రన్ లో ఆంధ్రా, సీడెడ్ లో కల్కి 15 నుంచి 20 కోట్ల మధ్యలో నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచి వసూళ్లు సాధించిన మూవీకి ఆంధ్రా, రాయలసీమలో మాత్రం నష్టాలు రావడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: