పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని లాంటి హాట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.భారీ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  ఏకంగా రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే 440 కోట్ల దాకా షేర్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ టార్గెట్ దాటేసింది. ఈ సినిమాకి టోటల్ గా 380 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిసినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటికే దాదాపు 60 కోట్ల దాకా లాభాలు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యార్లు సేఫ్ అయ్యారు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 190 కోట్లకు పైగా రాబట్టిన కల్కి... ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది.


ఆదివారం నాడు ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాలీవుడ్ లో ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో 15.50 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓవరల్ ఓవర్ సీస్ మార్కెట్లో 27 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు రాబట్టింది. అయితే దాదాపు బయ్యర్లు సేఫ్ అయినా కానీ.. నిర్మాత అశ్వినిదత్ మాత్రం సేఫ్ అవ్వలేదు. ఆయనకి ఇంకా 1 పర్సెంట్ కూడా లాభం రాలేదు. దానికి కారణం మూవీ బడ్జెట్.. ఈ మూవీ బడ్జెట్ 600 కోట్లు అయ్యింది. కాబట్టి నిర్మాత సేఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా 600 కోట్ల షేర్ వసూళ్లు ఈ సినిమాకి రావాలి. అంటే ఈ సినిమా దాదాపు 1200 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంది. రెస్పాన్స్ అదిరిపోవడంతో మున్ముందు ఈ సినిమా అంత రాబట్టగలదేమో అని నమ్మకం ఉంది. చూడాలి ఈ సినిమా 600 కోట్ల షేర్ వసూలు చేస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: