డైరెక్టర్ డి రామానాయుడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇలా ఎంతో కాలం నుంచే డైరెక్టర్గా చేస్తూ ఎన్నో సినిమాలు తీస్తూ ప్రేక్షకులనే బాగా కట్టుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మెషుల్ గా తనకంటూ కొన్ని పేజీలు లిక్కించుకున్నారు డైరెక్టర్ డి. రామానాయుడు. పది రూపాయల నోట్లు పై భాషలు ఉన్నాయో అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. నిర్మాతగానే కాకుండా మంచి మనిషిగా,  దానశీలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామానాయుడు తరువాత ఆయన కుమారులు సురేష్ బాబు, వెంకటేష్ లు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

వెంకటేష్ హీరోగా పరిచయమై..దశాబ్దాలుగా తెలుగు తెరను మోస్తున్న నలుగురు ఆగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు. సురేష్ బాబు మాత్రం సినిమాల్లో నటించకుండా, తండ్రి మదిరే నిర్మాతగా మారారు. సినిమాలు, తన కుటుంబం తప్పించి మరో ఇష్యూలో సురేష్ బాబు తలదూర్చారు. వివాదాలకు దూరంగా, పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అంతేకాదు...తెలుగు తెలుగు రాష్ట్రాలల్లో పలు థియేటర్లు నిర్మించడమో, లీజుకు తీసుకోవటమో చేస్తూ డిస్ట్రీ బ్యూషన్ రంగాన్ని కూడా శాసిస్తున్నారు. వీలున్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనోగతాన్ని పంచుకుంటూ ఉంటారు సురేష్ బాబు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమా ప్రయాణం సహా తదితర అంశాలపై కీలక విషయాలు వెల్లడించారు. వయసులో ఉన్నప్పుడు తాను కమల్ హాసన్ లా ఉండేవాడినని..అలాగే తన కారు, కమల్ కారు ఒకే మోడల్ కావడంతో అంతా తనను కమల్ హాసన్ అని పిలిచేవారని సురేష్ బాబు గుర్తు చేసుకున్నారు.

 నన్ను హీరోగా పెట్టి భారతీ రాజాసినిమా తీయడానికి ముందుకు వచ్చారని..అయితే తనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించానని ఆయన తెలిపారు. తొలి నుంచి వ్యాపారం చేయాలనే ఉండేదని, అందుకు తగ్గట్టుగానే నిర్మాతని అయ్యానని సురేష్ బాబు చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా విషయంలో చోటు చేసుకున్న గొడవ గురించి యాంకర్ ప్రశ్నించగా.. సురేష్ బాబు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. పవన్ తనకు మంచి మిత్రుడని అప్పుడు మా మధ్య చిన్న చిన్న విభేదాలే వచ్చేయని..తరువాత సర్దుకున్నామని ఆయన పేర్కొన్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు సంతోషించానని, ఆయన అనుకున్నది సాధిస్తారని భావించానని సురేష్ బాబు వెల్లడించారు. అయితే పవన్తో ఓ ఇష్యూలో గొడవ జరిగిందనేది మాత్రం ఆయన చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: