.అందాల ముద్దుగుమ్మ సాయి ధన్షిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె రజనీ కాంత్ హీరోగా రూపొందిన కబాలి సినిమాలో అతనికి కూతురు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ షికారు అనే తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో పెద్ద స్థాయిలోనే అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి ఇప్పటికే తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఎన్నో సార్లు ఫుల్ కిక్ ను ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి.  ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ  తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sd