పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా విడుదల అయి తొమ్మిది రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గడం లేదు. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్లో వచ్చిన ఈ సినిమా కాసుల వరకు కురిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన అమితాబచ్చన్ కమలహాసన్ వంటి స్టార్ నటి నటులు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.

  అందులో భాగంగానే ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా స్పిరిట్.  స్పిరిట్‌తో పాటు రాజాసాబ్‌, సలార్‌2తో పాటు హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీ చేస్తోన్నాడు ప్రభాస్‌. ఇందులో రాజా సాబ్ మూవీ ఈ ఏడాది చివరలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. సూపర్ నాచురల్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇక ప్రభాస్‌, డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో రాబోతోన్న స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సినిమాలో విలన్‌గా మార్వెల్

 యూనివర్స్‌ చెందిన యాక్టర్‌ను సందీప్ వంగా రంగంలోకి దించుతోన్నట్లు సమాచారం. స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్పిరిట్ మూవీని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ మూవీని ఇండియన్ భాషలతో పాటు కొరియన్‌, చైనీస్ భాషల్లోకి డబ్ చేసే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  తాజాగా ఈ కొరియన్ యాక్టర్ ప్రభాస్ స్పిరిట్ మూవీలో విలన్‌గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తోన్నాయి. మా డాంగ్ సియోక్ వీకీపీడియాలో పేజీలో అతడు స్పిరిట్ సినిమాలో నటించబోతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్ విలన్‌గా స్పిరిట్ మూవీలో ఈ కొరియన్ యాక్టర్ కనిపిస్తాడని అంటోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: