ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా టాప్ సినిమాలు చేసి సత్తా చాటిన నటి.. పాన్ ఇండియాలోనే అగ్రస్థానంలో కొనసాగిన ఆ హీరోయిన్ జీవితం మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పటి దాకా మొత్తం 12 మందిని ప్రేమాయణం నడిపింది. కానీ అవేవి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. లవ్ మాత్రమే కాదు.. పెళ్లి కూడా కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఆమె భర్తతో విడిపోయింది. తెలుగు, తమిళం ఇంకా హిందీ భాషలలో అగ్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ జీవితంలో చాలా ఒడి దుడుకులు ఎదుర్కొంది. ప్రస్తుతం ఆమెకు 53 సంవత్సరాలు. ఇప్పటికీ తనకు సరైన వ్యక్తి దొరికితే తన జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఆమె ఎవరో కాదు.. 

అలనాటి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన మనీషా కోయిరాలా.90వ దశకంలో భారత సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు వేసింది. సినీరంగుల ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాబా, ముంబయి, ఒకే ఒక్కడు, క్రిమినల్, డియర్ మాయ, లస్ట్ స్టోరీ, సంజు, ప్రస్థానం ఇంకా షెహజాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలకు దూరమైన సమయంలోనే క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. అయితే ఈ సమస్యకు చికిత్స తీసుకున్న మనీషా.. క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి సినిమాలపైన దృష్టి పెట్టింది.ఇటీవలే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ ఓటీటీ సినీ ప్రియుల ముందుకు వచ్చింది. 


ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా.. తన లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఫిలింఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ.. 'నేను తప్పుడు మగవాళ్ళని ప్రేమించాను.కేవలం ఒక్కసారి మాత్రమే కాదు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేశాను. నేను ఎందుకు ఇలా చేశాను అని ఆలోచించాను. తప్పులు చేసిన వ్యక్తులను మాత్రమే నేను ప్రేమించాను. ఆ తర్వాత నా తప్పును గ్రహించాను. ఇకపై అలాంటి మిస్టేక్ చేయకూడదని అనుకున్నాను. నేను గత ఆరేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను. ప్రస్తుతం మరొకరిని ప్రేమించడం.. లేదా ఎవరితోనా బంధాన్ని కలుపుకునే మానసిక స్థితిలో మాత్రం లేను. చెడు సంబంధాలలో ఉన్నప్పటికీ నేనెప్పుడు ప్రేమపై నమ్మకం కోల్పోలేదు. నన్ను అర్థం చేసుకునే.. నాతో నిజాయితీగా ఉండే భాగస్వామిని ఇప్పటికీ నేను కనుగొంటాను. నేను చాలా ఎమోషనల్ పర్సన్. కలలు, ఆశయాలు, అభిరుచి ఉన్నవారితో కలిసి ఉండాలనుకుంటున్నాను' అంటూ మనిషా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: