మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కథను మొదట బి.గోపాల్ రిజల్ట్ చేశాడట. అది ఎందుకు అనే వివరాలను తెలుసుకుందాం. తాజాగా కథ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ... బి గోపాల్ మొదట ఇంద్ర మూవీ కథను రిజెక్ట్ చేశాడు అని చెబుతూ అందుకు గల కారణాలను ... లాస్ట్ కి ఎలా ఒప్పుకున్నాడు అనే వివరాలను తెలియజేశారు. అశ్విని దత్ ... చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా చిన్ని కృష్ణ అనే కథ రచయిత దగ్గర ఒక కథ ను రెడీ చేయించారు. అది విన్న బి గోపాల్ కి ఆయన తయారు చేసిన కథ నచ్చలేదట.

దీనితో గోపాలకృష్ణ దగ్గరికి వచ్చి ఆ సినిమాను నేను చెయ్యను సార్ ... ఎందుకు అంటే ఇప్పటికే నేను బాలకృష్ణ గారితో సమర సింహా రెడ్డి , నరసింహా నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. మళ్లీ అలాంటి ప్యాక్షట్ సినిమా అయితే చిరంజీవి పై  వర్కౌట్ కాదు. ఇప్పటికే నేను చిరంజీవి తో మెకానిక్ అల్లుడు సినిమా చేసి దెబ్బతిని ఉన్నాను అని అన్నాడట. ఇక దానితో పరుచూరి గోపాలకృష్ణ ఒక హీరో పై రెండు మూడు సార్లు ఒకే కథను తీస్తే వర్క్ అవుట్ కాదేమో కానీ ... వేరే హీరోతో అలాంటి కథనే తెరకెక్కిస్తే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పాడట. దానితో వెంటనే ఆయన చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి దానిని ఇంద్ర గా రూపొందించడానికి డిసైడ్ అయ్యాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: