పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మన అందరికీ తెలిసిందే. ఆయన డబ్బు కి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడు. ఎక్కువ శాతం ఇచ్చిన మాటపై నిలబడడానికే చూస్తూ ఉంటాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో తొలిప్రేమ మూవీ తో మొదటగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో భాగంగా తొలిప్రేమ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను. అది ఎలా ఇచ్చారు అనే విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా పవన్ కళ్యాణ్ కు మీ కెరియర్ లో తొలిప్రేమ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆ సినిమాకు మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ ... ఆ సమయంలో నేను కొత్త హీరోను. నాకు పెద్దగా మార్కెట్ కూడా లేదు. దానితో వారు నాకు కొంత మొత్తం పారితోషికం ఇస్తాను అని అన్నారు. ఇక సినిమా కోసం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయింది. దానితో వారు నా దగ్గరకు వచ్చి సినిమా విడుదల అయిన తర్వాత మంచి విజయం సాధిస్తే మీ డబ్బులు మీకు ఇస్తాము అని అన్నారు.

దానితో నేను కూడా సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అయింది ... వారు కష్టాల్లో ఉన్నారు. సినిమాకు లాభాలు వస్తే రెమ్యూనిరేషన్ తీసుకుందాం అనుకున్నాను. ఇక సినిమా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ అయ్యింది. దానితో వారు నాకు ఇస్తాను అన్న రెమ్యూనిరేషన్ మొత్తం ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. ఇలా తొలిప్రేమ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి అయ్యి , విడుదల అయ్యి , లాభాలు వచ్చాకే పారితోషికం తీసుకున్నట్లు చెప్పాడు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో , రాజకీయాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: