సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ పీక్స్ లో ఉంది. టాక్ తో సంబంధం లేకుండా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం కూడా ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి అది నిదర్శనం. ఈ సినిమా తరువాత మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం రాజమౌళి-మహేష్ బాబు కలిసి సినిమా చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ సమకూర్చారు. స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారు.ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రెండేళ్లకు పైగా సమయాన్ని మహేష్ బాబు ఈ మూవీకి కేటాయిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి ఒక పట్టాన సినిమా పూర్తి చేయడు. అనుకున్న సమయానికి కనీసం ఏడాది పైగా సమయం తీసుకుంటారు. ఎస్ఎస్ఎంబి 29 విడుదలయ్యేది కూడా మూడేళ్ళ తర్వాతే అనే వార్త వినిపిస్తోంది.కాగా ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నారు.


అయితే గతంలో బాగా పెరిగిన గడ్డం లుక్లో మహేష్ బాబు కనిపించలేదు. ఆయన ఎప్పుడు తన మీసం కూడా చాలా లైట్ గా ఉండేలా చూసుకుంటాడు. అయితే రాజమౌళి ప్రతి హీరోని కూడా భిన్నంగా చూపిస్తారు. తన హీరోని గతంలో ఎన్నడూ ట్రై చేయని లుక్ లో ప్రజెంట్ చేస్తాడు. సూపర్ స్టార్ మహేష్ ని కూడా ఆయన ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యేలా సిద్ధం చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు జుట్టు ఇంకా గడ్డం పెంచుతున్నారు.తాజాగా సూపర్ స్టార్ మహేష్ లుక్ లీక్ అయ్యింది. ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు. అయితే ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులు ఆయన్ని తమ కెమెరాలలో బంధించారు.  మహేష్ బాబు లుక్ కిరాక్ తెప్పించింది. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. శాంపిల్ ఇలా ఉంటే.. రాజమౌళి మూవీలో మహేష్ బాబు ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: