పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని లాంటి హాట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  ప్రస్తుతం కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 190 కోట్లకు పైగా రాబట్టిన కల్కి... ఇక హిందీలో కూడా  10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు కూడా రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.మొత్తంగా ఈ రోజుతో బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. 


బాలీవుడ్ లో ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో 15.50 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ ఓవర్ సీస్ మార్కెట్లో 27 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు రాబట్టింది. అయితే మామూలుగా కల్కి సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు 191 కోట్లు వచ్చాయి. అయితే ఈ వసూళ్లు చూసి అతి త్వరలో ఈ సినిమా ఈజీగా 1000 కోట్లు వసూలు చేస్తుంది అని అందరూ ఊహించారు. కానీ  10 రోజులు అయినా కూడా నేటికీ 865 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఈ సినిమాకి ఉన్న హైప్ కి 1000 కోట్లు చాలా త్వరగా వచ్చేస్తాయి అనుకున్న ఈ సినిమాకి ఇంత స్లోగా కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అశ్వినీ దత్సినిమా కోసం 600 కోట్ల డబ్బులు  ఖర్చుపెట్టినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ సినిమా ఇప్పటికే పెట్టిన బడ్జెట్ దాటి మినిమం 600 కోట్లకి పైగా షేర్ 1200 కోట్లకి పైగా గ్రాస్ రావాలి. కానీ అ దారిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు.ఇలాగే కంటిన్యూ అయితే చాలా కష్టమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: