రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ "మిర్చి" సినిమా వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాలను అందుకొని ఈయన ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి మూవీ తర్వాత నుండి ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన బాహుబలి సినిమా తర్వాత సాహో ,  రాదే శ్యామ్  , ఆది పురుష్ , కల్కి 2898 AD అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాహో , రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలతో ప్రభాస్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. సలార్ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా విడుదల అయిన కల్కి 2898 AD సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రభాస్ ఎన్నో సినిమాలలో నటిస్తూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్న ఆయన పెళ్లి గురించి మాత్రం ఎప్పటికప్పుడు అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇక తాజాగా ప్రభాస్ పెద్దమ్మ అయినటువంటి శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా మాట్లాడింది ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్యామలా దేవి మాట్లాడుతూ ... బాహుబలి తర్వాత ప్రభాస్ కి సినిమాల్లో విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు కల్కి తో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. అలాగే ఆయన పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది. ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. ఆ సమయం రాగానే వివాహం జరిగి తీరుతుంది అని ఆమె తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: