ఈ మధ్య కాలంలో మన సౌత్ సినిమాలో హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 12 సౌత్ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా హిందీ ఏరియా నుండి 511 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 435.2 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ 276.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.


ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27వ తేదీన విడుదల ఇప్పటివరకు పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ పది రోజుల్లోనే ఈ సినిమా 190.50 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమా 189.55 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే ఐదవ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా 153.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో సినిమా 150 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా 118.7 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఎనిమిదవ స్థానంలోనూ నిలిచింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మొదటి భాగం 109 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలోనూ , రిషబ్ శెట్టి హీరోగాను దర్శకుడుగాను రూపొందిన కాంతారా సినిమా 84.77 కోట్ల కలెక్షన్లను వసులు చేసి పదవ స్థానంలో నిలిచింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 52.46 కోట్ల కలెక్షన్లతో 11 వ స్థానంలోనూ , యాశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 మూవీ 45 కోట్లతో 12 వ స్థానంలోనూ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: