ఓవర్సీస్ లో తన రికార్డ్ తానే బద్దలు కొట్టబోతున్న ప్రభాస్? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  రూ. 866 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  ప్రస్తుతం కల్కి 2898 ఏడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ రెస్పాన్స్ దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా రాబట్టిన కల్కి... ఇక హిందీలో కూడా  ఇప్పటిదాకా ఈ సినిమా రూ. 200 కోట్ల  గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు  రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.మొత్తంగా  బాలీవుడ్ లో 'కల్కి 2898ఏడి' సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. 


బాలీవుడ్ లో ఇక రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో సౌత్ సినిమాగా 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. అమితాబ్ బచ్చన్ రోల్ కి ఫిదా అయిన బాలీవుడ్ ప్రేక్షకులు కల్కి సినిమాని బాగా లైక్ చేస్తున్నారు.తాజాగా కల్కి కలెక్షన్ల విషయంలో నైజీరియా దేశంలో కూడా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా ఆ దేశంలో ఏకంగా ఆల్ టైమ్ రికార్డును అందుకొన్నది. ఈ మూవీ గతంలో సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. యానిమల్ కలెక్ట్ చేసిన 1 మిలియన్ నైజీరియన్ నైరాలు అంటే ఇండియా కరెన్సీలో 50 లక్షల రూపాయల కలెక్షన్లను బ్రేక్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా ఓవరాల్ ఓవర్ సీస్ మార్కెట్లో 30 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు రాబట్టింది.ఒక్క బాహుబలి 2 సినిమా రికార్డులు తప్ప ఈ సినిమా అన్ని పాన్ ఇండియా సినిమాల ఓవర్ సీస్ రికార్డులని బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: