రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , మృనాల్ ఠాగూర్ , శోభన ముఖ్య పాత్రలలో నటించగా ... దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే విమూవీ లో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు.

దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ ఈ మూవీ ని నిర్మించింది. ఈ మూవీ లో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో మాత్రం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతూనే ఉన్నాయి.

ఇక నిన్న ఆదివారం కావడంతో ఈ సినిమాకు నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నిన్న ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఏకంగా 3.80 కోట్ల షేర్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ మూవీ కి ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 69 కోట్ల షేర్ కలక్షన్ లు వచ్చినట్లు సమాచారం. ఇదే రేంజ్ లో ఈ మూవీ కనక మరికొన్ని రోజులు నైజాం ఏరియాలో కలెక్షన్ రాబట్టినట్లు అయితే 80 కోట్ల షేర్ కలక్షన్ రాబట్టే అవకాశం ఉంది. మరి నైజాం ఏరియాలో ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: