టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్స్ లో వున్న సమయాంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.అలాగే రీసెంట్ గా సత్యభామ సినిమాతో కాజల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2  సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..ఈ సీక్వెల్‌లో కాజల్ క్యారెక్టర్ కనిపించదని దర్శకుడు శంకర్ తెలుగు ప్రమోషన్స్‌లో వెల్లడించాడు.ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు శంకర్‌. ఇండియన్ 2 లో తన రోల్ కోసం గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్‌లో కాజల్‌ ట్రైనింగ్ తీసుకున్నది. చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేసింది. ఇండియన్ 2 తమిళ ప్రమోషన్స్‌లో కూడా కాజల్ సందడి చేయడంతో ఆమె ఈ సినిమాలో కనిపించడం ఖాయమని అభిమానులు భావించారు. 

కానీ కాజల్ ఈ సినిమాలో అసలు కనిపించదని చెప్పి శంకర్ ట్విస్ట్ ఇచ్చాడు.ఆదివారం భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ కాజల్ క్యారెక్టర్ ఇండియన్ 2లో ఉండదని, పార్ట్ 3లో ఆమె కనిపిస్తుందని తెలిపారు.ఇండియన్ 2 కోసం కాజల్‌పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3లో కనిపించేలా శంకర్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేశాడని సమాచారం.. ఆ ఛేంజెస్‌లో భాగంగానే కాజల్ క్యారెక్టర్ సీక్వెల్‌లో కనిపించకుండాపోయిందని తెలుస్తుంది.. పార్ట్ 2లో తన క్యారెక్టర్ లేదని ముందుగానే తెలియడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాజల్ దూరంగా ఉంటుందని  సమాచారం .గతంలో ఆచార్య సినిమాలో కూడా ఇలాగే జరిగింది. చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. చిరంజీవి, కాజల్ కాంబినేషన్‌లో చాలా సీన్స్ షూట్ చేశారు. రామ్ చరణ్ క్యారెక్టర్ నిడివి పెంచి, కథను మరింత కమర్షియలైజ్ చేయడానికి రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు కాజల్ క్యారెక్టర్ మొత్తాన్ని సినిమా నుంచి తొలగించి దర్శకుడు కొరటాల కాజల్ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు శంకర్ కూడా అలా చేయడంతో కాజల్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఇండియన్ పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: