రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలను వదులుకోవడం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ప్రభాస్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఒక్కడు సినిమా కథను మొదట ప్రభాస్ కి వినిపించారు డైరెక్టర్ గుణశేఖర్.. అయితే కాన్సెప్ట్ రిస్క్ గా ఉందని భావించిన ప్రభాస్ ఆ స్క్రిప్ట్ ను తిరస్కరించాడు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన సినిమా బృందావనం. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఈ మూవీ కథను కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రభాస్ కి వినిపిస్తే.. ఆ సమయంలో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.అలాగే నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమా ఆఫర్ ను కూడా మొదట ప్రభాస్ కు వెళ్ళింది.కానీ ఇంకో సినిమాతో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ ఈ సినిమాను దీనిని రిజెక్ట్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ మొదట ఈ మూవీని ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాశారట. కానీ ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చలేదని ప్రభాస్ రిజెక్ట్ చేశారు.. అయితే ఇదే సినిమాను అల్లు అర్జున్ చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.అలాగే రవితేజ హీరోగా నటించిన డాన్ శీను కథ మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. అయితే ప్రభాస్ ఈ కాన్సెప్టు నచ్చలేదని ఆయన రిజెక్ట్ చేశారు.. 


గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా 100 రోజులు థియేటర్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని అప్పట్లో రికార్డు సృష్టించింది.అప్పటి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా నాయక్. అయితే ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్తే ..ప్రభాస్ మిర్చి సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.ఇక రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన చిత్రం సినిమా జిల్. అయితే ఈ సినిమా కథ కూడా ప్రభాస్ దగ్గరకు ముందుగా వెళితే ఆయన బాహుబలి సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు.సీనియర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఊసరవెల్లి… ఈ సినిమా కథ కూడా ప్రభాస్ కి మొదట వినిపించినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు.అలాగే రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం కిక్.. ఈ సినిమా కథను కూడా సురేందర్ రెడ్డి ముందుగా ప్రభాస్ కు వినిపిస్తే.. ప్రభాస్సినిమా కథపై దృష్టి పెట్టలేకప ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేశారు.ఇంకా అలాగే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా కూడా మొదట రెబల్ స్టార్ ప్రభాస్ వద్దకు చేరింది.. అయితే ప్రభాస్ తనకు మాస్ గెటప్ సరిపోదని అప్పట్లో చెప్పి రిజెక్ట్ చేశారు.ఇలా ఈ సినిమాలన్నీ కూడా ప్రభాస్ వదులుకోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: