యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ ప్యాకెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో పాటు వార్ 2 అనే హిందీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇక వార్ 2 మూవీ విషయానికి వస్తే ఈ మూవీ లో హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోయినా దేవర మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకే వార్ 2 మూవీ విడుదల తేదీని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వార్ 2 మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ సంబంధించి ఓ కీలకమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే విషయం బయటపడనున్నట్లు , దానితోనే ఈ సినిమా పూర్తి కాబోతున్నట్లు , ఇక వార్ 2 ఎండ్ అయినా చోటు నుండే వార్ 3 స్టార్ట్ కావడానికి కావలసిన విధంగా కథను ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో హిందీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వార్ 2 సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే హిందీ ఏరియాలో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దేవర సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విజయం సాధించిన కూడా ఇండియా వ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: