సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరువాత సినిమా సెలిబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వాడకాన్ని బాగా పెంచారు. ఈ క్రమంలో ముఖ్యంగా హీరోయిన్స్ తమకి సంబందించిన పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ ని తమవైపుకు తిప్పుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. ఈ తరుణంలో వారు పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని చాలా సీరియస్ గా ఉంటాయి. మరి కొన్ని ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మరికొన్ని సమాజాన్ని మేలు కొలిపేవిగా ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తయితే దాదాపు చాలామంది షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు గ్లామర్ కి సంబంధించినవే అయి ఉంటాయి.

ఇక ప్రస్తుత విషయానికొస్తే బాలీవుడ్ బ్యూటీల సంగతి గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వీరు ఫిట్ నెస్ ప్రీక్ లు అని చెప్పుకోవచ్చు. ఖాళీ సమయాల్లో జిమ్, యోగా, డైట్ అంటూ ఓ టైమ్ టేబుల్ ఫాలో అవుతూ ఫిట్ నెస్ ని ఓ దారిన పెడుతూ ఉంటారు. అలాగే రిస్క్ లు సైతం చేస్తున్న సంద‌ర్భాలుంటాయి. ఒక‌వేళ అవి తేడా కొడితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది? కూడా వారికి బాగా తెలుసు. తాజాగా యంగ్ బ్యూటీ అల‌య ఎఫ్ అలాంటి ఫీట్ చేయ‌బోయి ప్రమాదం అంచునుండి తప్పించుకుంది. అవును... తేడా జ‌రిగితే తొడ, మెడ రెండు కింద‌కు జారిపోయేవే.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ముద్దుగుమ్మ మార్నింగ్ షెడ్యూల్ లో భాగంగా జిమ్ములో క‌స‌ర‌త్తులు చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో హైబార్ మీద కాళ్లు , చేతులు ఒకేసారి ఉంచాల‌ని ట్రై చేసింది. ఈ క్ర‌మంలో వాల్ స‌హ‌కారంతో 2 కాళ్ల‌ను ఒకేసారి భుజం మీద‌కు పెట్టుకోవాలని ట్రై చేసింది. ఈ క్ర‌మంలో ఓ కాలు భుజం మీద‌కు వెళ్ల‌గా.. మ‌రో కాలి కింద‌కి వేలాడింది. దీంతో చేతులు లాగ‌డం ఎక్కువ అవ్వ‌డంతో వాయ్యో... వామ్మో అంటూ అరుపులు అరిచింది. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న ట్రైనర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కాళ్ల‌ను స‌రిచేసి కింద‌కు దించడంతో పెద్ద ప్ర‌మాదం తప్పినట్లయింది. లేదంటే అల‌యా కాళ్లు, చేతులు, మెడ అన్నీ జారిపోయేవి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో చూస్తే మనకి కూడా ఆ ఫీలింగ్ కలగక మానదు!



మరింత సమాచారం తెలుసుకోండి: