దివంగత నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే సౌందర్య తనకంటూ మంచి పేరు గుర్తింపును సంపాదించుకున్నారు. దక్షిణాదిన సౌందర్యకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సౌందర్య తెలుగు, మలయాళం, కన్నడ తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించింది. 2003 సంవత్సరంలో సౌందర్య టాప్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సౌందర్య వైవాహిక జీవితం కొద్దిరోజుల పాటే ఆనందంగా సాగింది. దురదృష్టం సౌందర్యను వెంటాడుతూ వెళ్ళింది. వివాహమైన ఏడాదిలోనే సౌందర్య మరణించారు. సౌందర్య మరణించి ఇప్పటికీ 20 ఏళ్లు అయిపోయింది.

2004 ఏప్రిల్ 17వ తేదీన రాజకీయాల్లో ప్రచారం చేయడానికి వెళ్ళిన సౌందర్య ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించింది. అప్పటికి సౌందర్య వయసు 31 సంవత్సరాలు మాత్రమే. సౌందర్య మరణించే సమయంలో తన సోదరుడు కూడా అదే ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన అప్పట్లో తన అభిమానులను కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇదిలా ఉండగా.... ఒకప్పుడు సౌందర్య ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఎక్కువగా వెంకటేష్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ తను హీరోగా నటించిన పవిత్ర బంధం సినిమా గురించి మాట్లాడుతూ.... ఆ సినిమా సినిమాలో సౌందర్య కాళ్ళను పట్టుకునే సీన్ ఉంటుందని, దానికి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందని వెంకటేష్ తెలిపారు. దీన్ని చులకనగా చేసి చాలామంది వెంకటేష్ ని భయపెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారట. కానీ సినిమా కథ బాగుంటే జనాలు తప్పకుండా ఆదరిస్తారని అనుకున్నాము. ఇక మేము అందరం అనుకున్నట్లుగానే పవిత్ర బంధం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


ఇప్పటికీ ఆ సినిమా వస్తే చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సినిమా ఆల్ టైం నా ఫేవరెట్ సినిమా అని చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా సౌందర్య, నేను చాలా మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉండేది. సౌందర్య మరణించడం నిజంగా చాలా బాధాకరం. సౌందర్యం మరణంతో ఒక మంచి స్నేహితురాలిని కోల్పోయానని సంచలన వాక్యాలు చేశారు. ప్రస్తుతం వెంకటేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: