ఇండియన్ 2 రిలీజ్ కి ముందు మన సత్యభామకి డైరెక్టర్ శంకర్ షాక్ ఇచ్చాడు. ఈ సీక్వెల్ లో కాజల్ క్యారెక్టర్ కనిపించదని తెలుగు ఆడియన్స్ తో వెల్లడించాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాడు శంకర్. ఇక ఈ మూవీలో తన రోల్ కోసం గుర్రపు స్వారీ, మర్షల్ ఆర్ట్స్ లో కాజల్ తీసుకుంది. చాలా రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ చేసింది కూడా. ఇక ఈ మూవీ తమిళ్ ప్రమోషన్స్ లో కాజల్ సందడి చేయడంతో ఆమె ఈ సినిమాలో కనిపించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడ్డారు.


కానీ కాజల్ ఈ చిత్రంలో అసలు కనిపించదని చెప్పి శంకర్. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ కాజల్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఉండదని పార్ట్ 3 లో ఆమె కనిపిస్తుందా నీ తెలిపాడు. ఈ మూవీ కోసం కాజల్ పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3 లో కనిపించేలా శంకర్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడని అన్నాడు. ఆ చేంజెస్ లో భాగంగానే కాజల్ క్యారెక్టర్ సీక్వెల్లో కనిపించబోతుందని వెల్లడించారు.


పార్ట్ 2 లో తన క్యారెక్టర్ లేదనే నిజం ముందుగానే తెలియడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కు కాజల్ దూరంగా ఉంటుందని అంటున్నారు. గతంలో ఆచార్య సినిమాలో అలాగే జరిగింది. చిరంజీవి అండ్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కాజను హీరోయిన్గా తీసుకున్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో చాలా సీన్స్ షూట్ చేశారు. రామ్ చరణ్ క్యారెక్టర్ విడివి పెంచి కథను మరింత బాగుండేలా చేయడానికి రిలీజ్ కు కొద్ది రోజుల ముందు కాజల్ క్యారెక్టర్ మొత్తాన్ని సినిమా నుంచి తొలగించారు. అలా అప్పుడు ఆచార్య ఇప్పుడు ఇండియన్ 2 కాజల్ పాపకి ద్రోహం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: