ఒకప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే భారీ వసూళ్లకు భారీ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం బాలీవుడ్ లో ఏ బడా హీరో సినిమా వచ్చినా.. అది ఎందుకో అంచనాలను అందుకోలేక చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోతుంది. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్ప ఎక్కడ లాభాలు రావడం లేదు అని చెప్పాలి. సౌత్ నుంచి బాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు సూపర్ హిట్ సాధిస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తుంటే.. అక్కడి హీరోల సినిమాలు మాత్రం ఎక్కడా ప్రభావం చూపు లేకపోతున్నాయి.


 దీంతో వందల కోట్ల భారీ బడ్జెట్లో సినిమాను తెరకెక్కించినప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఇక నిర్మాతలకునష్టాలు తప్పడం లేదు అని చెప్పాలి. అయితే ఇలా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నప్పటికీ బాలీవుడ్ లోని స్టార్ హీరోస్ అందరూ కూడా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఎక్కడ ఇష్టపడటం లేదు. అయితే ఇలా పారితోషకం ఎక్కువగా ఉండడమే నిర్మాతలకు ఎక్కువ నష్టాలు రావడానికి కారణం అవుతుంది అంటూ ఇప్పటికే ఎంతో మంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.


 అయితే సరైన హిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ పై నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు కనీసం 3.5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తీసుకు రావట్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కరణ్ జోహార్. ఇండస్ట్రీలోని 10 మంది స్టార్స్ భారీగా పారితోషకం తీసుకొని నిర్మాతలకు భారం అవుతున్నారు. నటీనటులకు మేకింగ్ కోసం మార్కెటింగ్ కోసం అని మీరే చెల్లించాలి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే చివరికి నష్టాలు కూడా మీరే భరించాలి అంటూ నిర్మాతలను ఉద్దేశిస్తూ కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: