ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అయ్యాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా , తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకొని కొన్ని రోజుల క్రితమే ప్రతినిధి 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు సుందరకాండ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు.

దుల్కర్ సల్మాన్ హీరో గా వెంకి అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీన దేవర మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో వీరు ఈ సినిమాను ప్రి ఫోన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: