టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి రవితేజ , నాని , నితిన్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

రవితేజ ప్రస్తుతం RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు "బీ హెచ్ ఈ ఎల్" పరిసర ప్రాంతాల్లో రవితేజ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  , ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఎస్ జె సూర్య , ప్రియాంక అరుణ్ మోహన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ ఇద్దరు నటీనటులపై చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ సినిమాకే కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం నితిన్ పై బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఇందులో ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: