టాలీవుడ్ సీనియర్ హీరో సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి మన తెలుగులో కూడా రాణిస్తున్న హీరోలలో సిద్ధార్థ ఒకడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయిన... సిద్ధార్థ... ఆ తర్వాత... టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరుగాంచిన హీరోగా మారిపోయాడు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్... లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా సంపాదించుకున్నాడు.

అయితే అలాంటి సీనియర్ హీరో సిద్ధార్థ తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెద్దలకు ఊహించని షాక్ ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. హీరో సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. కమలహాసన్ హీరోగా దర్శకుడు శంకర్  ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా... మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాదులో భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.



ఈ సందర్భంగా జర్నలిస్టులకు...హీరో సిద్ధార్థ సమాధానం ఇస్తూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు పెంచమని అడిగే హీరోలు... మొదటగా డ్రగ్స్ ను అరికట్టే విధంగా... ఓ వీడియోను ఫ్రీగా చేయాలని రేవంత్ రెడ్డి గతంలో తెలిపారు.  అయితే ఆ వ్యాఖ్యలను.. ఎలా తీసుకుంటారని జర్నలిస్టులు అడిగితే సిద్ధార్థ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ...  తాను ఎప్పుడో కాండమ్స్ గురించి ప్రకటన కూడా చేసినట్లు తెలిపాడు. 

20 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తాను వస్తున్నానని... 2005 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు తాను కాండమ్స్ ప్రమోట్ చేసినట్లు తెలిపాడు.  తన అంతట తానే సామాజిక బాధ్యత తీసుకొని ఆ యాడ్ చేసినట్లు గుర్తు చేశారు.కానీ నాకు ఎవరో ముఖ్యమంత్రి వచ్చి చెప్పలేదని...  తానే స్వయంగా చేసినట్లు చురకలంటించారు. ఇప్పటిదాకా ఇలా చేస్తేనే అలా చేస్తామని ఏ ముఖ్యమంత్రి మాతో చెప్పలేదని వివరించారు. దీంతో సిద్ధార్థ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: