అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు పల్లవి ప్రశాంత్ కూడా సోషల్ మీడియా ద్వారా పలు రకరకాల పోస్టులు షేర్ చేస్తూ.. రైతు బిడ్డను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి అన్నా అంటూ ఎప్పటినుంచో వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని సైతం పెంచుకునేవారు పల్లవి ప్రశాంత్.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్-7 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు నాగార్జున కూడా పల్లవి ప్రశాంతిని బాగా ప్రోత్సహించడం జరిగింది.
హౌస్ లో టాస్కులు బాగా ఆడి ప్రేక్షకులకు దగ్గర అయిన పల్లవి ప్రశాంత్.. హౌస్ లో ఉండే రీతికా రోజ్ తో లవ్ ట్రాక్ నడపడం ఆ తర్వాత ఆమెను అక్క అని పిలవడం అలాగే హౌస్ లో అమర్దీప్ తో గొడవలు శివాజీ తో ఉంటూ ఆయన చెప్పినటువంటి చేయడం వంటివి చేయడం ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా పల్లవి ప్రశాంతంగా వీడియోలను చేస్తూ ఒక వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 8 కు పంపాలి అంటూ వీడియో చేశారు.. ఈ వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. బిగ్బాస్ సీజన్ 8 అని తలమీద రాసుకొని పరుగెత్తుకుంటూ ఈ వీడియో షేర్ చేశారు. ఆల్ ఇండియా అందగాడు రవి అనే పేజ్ నుంచి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. దీంతో ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. నువ్వెవరు బ్రో ఇలా తయారయ్యావు ఖచ్చితంగా నీకు బిగ్ బాస్-8 స్వాగతం పలుకుతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.