ఏ మూవీ పై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే మైత్రి మూవీస్ పతాకం పై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకులందరిలో కూడా మరింత అంచనాలను పెంచేసాయి. అయితే అన్ని భాషల్లో కూడా పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడూ దాదాపు 400 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల చివరికి డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం.. కొన్ని సన్నివేశాలు డైరెక్టర్ సుకుమార్ అనుకున్న విధంగా రాకపోవడంతో చివరికి కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారు. దీని కారణంగానే ఇక అటు సినిమా విడుదల వాయిదా పడింది అనేది తెలుస్తుంది ఇక బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందట. దీంతో నిర్మాతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. నాలుగు నెలల వడ్డీ ఖర్చు పెరుగుతుందని.. తిరిగి మళ్లీ సన్నివేశాలు తీయాలంటే భారీ బడ్జెట్ అవుతుండడంతో.. ఉన్నదానితోనే సరిపెట్టుకుని తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యత వచ్చేలా తీయాలంటూ సుకుమార్ కు చెప్పారట. ఇలా షూటింగ్ కి సరిపడా బడ్జెట్లో కేటాయించకపోవడంతో.. ఇంకోవైపు ఇక నటీనటులు ఎంత చెప్పినా తన అనుకున్న రీతిలో టేక్స్ రాకపోవడంతో ఇక సుకుమార్ తీవ్ర అసహనానికి లోనయ్యారట. షూటింగ్ సమయంలో కూర్చుని ఖాళీతో తన్ని షూటింగ్స్ స్పాట్ నుంచి వెళ్లిపోయారట. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమైనది మాత్రం తెలియదు.