టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక గతంలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సల్మాన్ ఖాన్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవాడు. ఆయన నాకు మంచి స్నేహితుడు అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్ కూడా రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని , అతను నాకు ఉన్న స్నేహితులలో మంచి స్నేహితుడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే సల్మాన్ ఖాన్ కేవలం రామ్ చరణ్ కు మాత్రమే కాకుండా చిరంజీవికి కూడా మంచి స్నేహితుడే. ఆ కారణంతో చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో ఈయన ఓ కీలకమైన పాత్రలో కూడా నటించాడు. ఇక ఇందుకోసం సల్మాన్ ఖాన్ ఏ మాత్రం రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు అని సమాచారం. ఇకపోతే సల్మాన్ ఖాన్ కొంత కాలం క్రితం కిసి కా భాయ్ కసి కా జాన్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వీరమ్ సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది.

వీరమ్ సినిమా తెలుగులో కాటమరాయుడు అనే పేరుతో కూడా రీమేక్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. ఇకపోతే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన కసి కా భాయ్ కిసీ కా జాన్ మూవీ లో రామ్ చరణ్ ఒక చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఇక సల్మాన్ ఖాన్ పై ఉన్న అభిమానంతో ఆయన ఈ సినిమాలో నటించిన అందుకు రెమ్యూనిరేషన్ తీసుకోలేదు అని సమాచారం. ఇక ఇలా వీరు మంచి స్నేహబంధంతో సినిమాలలో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: