మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ న్యూస్ రీడర్ గా మొదలు పెట్టి ఆ తర్వాత యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక యాంకర్ గా సూపర్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె సినిమాలలో నటించడం స్టార్ట్ చేసింది. ఇక ఈమె సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపాడేస్తూ రావడంతో ఈమెకు అవకాశాలు భారీగా పెరిగాయి.

ఇకపోతే ఈమె కెరియర్ స్టార్టింగ్ లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. మరి ఆ సినిమా ఏది ..? ఎందుకు ఈమె పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సమంత , ప్రణీత హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం అత్తారింటికి దారేది అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో "ఇట్స్ టైం టు పార్టీ నౌ" అనే ఐటమ్ సాంగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సాంగ్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు హంస నందిని , ముంతాజ్ నటించారు. ఇక మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయ దగ్గరకు వెళ్లాడట. ఆ సమయంలో త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు కొంత మంది హీరోయిన్లు ఉంటారు. వారిలో మీరు కూడా ఒకరు అని చెప్పారట. దానితో ఆమె పవన్ కళ్యాణ్ తో నేను ఒక్క దానిని అయితే నటిస్తాను కానీ చాలా మంది తో అయితే చేయను అని చెప్పిందట. అలా పవన్ కళ్యాణ్ సినిమాని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందంట.

మరింత సమాచారం తెలుసుకోండి: