‘కల్కి 2898’ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగి పోతోంది. ఈమూవీలో శ్రీకృష్ణుడి పాత్రకు సంబంధించిన మొఖం చూపెట్టకుండా కేవలం అతడి లుక్ ను బ్లర్ చేసి కేవలం అర్జున్ దాస్ డబ్బింగ్ తో ఆపాత్రను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. ఈమూవీ బ్లాక్ బష్టర్ అవ్వడంతో ఈమూవీలోని పురాణ పాత్రల పై సోషల్ మీడియాలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీలో శ్రీకృష్ణుడి పాత్ర లుక్ ను బ్లర్ చేయకుండా ఆ పాత్రలో మహేష్ చేత నటింప చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. మరికొందరైతే ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ సహకారంతో మహేష్ శ్రీకృష్ణుడి పాత్ర గెటప్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.


ఈవిషయాలు అన్నీ నాగ్ అశ్విన్ దృష్టి వరకు రావడంతో మహేష్ కృష్ణుడి లుక్ పై నాగ్ అశ్విన్ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. శ్రీకృష్ణుడు గా మహేష్ లుక్ బాగుందని అది తనకు బాగా నచ్చిందని చెపుతూ ఎవరైనా దర్శకుడు మహేష్ తో కృష్ణుడు పాత్రతో ‘మహాభారతం’ తీయగలిగితే చూడాలని తనకు కూడ కోరిక ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా కొందరు సోషల్ మీడియాలో ఒక అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సహకారంతో మహేష్ ని శ్రీకృష్ణుడుగా మార్చి రకరకాల ఫోటోలను డిజైన్ చేసి హడావిడి చేస్తున్నారు. వాస్తవానికి ‘కల్కి 2898’ మూవీలో శ్రీకృష్ణుడి పాత్రను ఒక టాప్ హీరోతో చేయించాలని ఆలోచన నాగ్ అశ్విన్ కు వచ్చింది అన్న వార్తలు వచ్చాయి.


అయితే ఈమూవీ నిర్మాత అశ్వినీ దత్ తెలుగు ప్రజలు శ్రీకృష్ణుడుగా ఒక్క నందమూరి తారకరామారావుని తప్ప మారెవ్వరిని అంగీకరించరానీ అందువల్ల అలాంటి సాహసం ఏదీ చేయవద్దు అంటూ అశ్వినీ దత్ నాగ్ అశ్విన్ కు సలహా ఇచ్చాడు అని అంటారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: