అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏ సినిమాలలో ప్రేక్షకులు అందరికీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సినిమాలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి అలాంటి సినిమాలలో పున్నమినాగు సినిమా కూడా ఒకటీ. ఇక ఈ మూవీలో మెగాస్టార్ నటనకి అందరూ ఫిదా అయిపోయారు. మెగాస్టార్ కెరియర్ లో ఉన్న పెద్ద హిట్ సినిమాలలో పున్నమినాగు సినిమా కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్న విషయం తెలిసిందే. అది సరేగాని ఇప్పుడు చిరు పున్నమినాగు సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.
మెగాస్టార్ పున్నమినాగు సినిమాలో ఏకంగా చిరంజీవికి జోడిగా నటించిన హీరోయిన్ రతి గురించి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈమె ఫోటో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈమె ఏంటీ ఇలా మారిపోయింది అనుకుంటున్నారు. తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ఓ సినిమాతో వెండితెరకు పరిచయమైంది రతి. ఇక కమలహాసన్, రజనీకాంత్ లాంటి లెజెండ్రీ హీరోలతో కూడా నటించింది. తెలుగులో మెగాస్టార్ తో పున్నమినాగు సినిమా తీయగా.. పెద్ద హిట్ అయింది. ఇక సినిమాల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది రతి. ఆమె పూర్తి పేరు ప్రతి అగ్నిహోత్రి. 1985లో వ్యాపారవేత్త అనిల్ వీర్వానిని పెళ్లి చేసుకుంది. ఇటీవల కొడుకుతో దిగిన కొట్టిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆమెను చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.