కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో ఓటీటీ కల్చర్ పెద్దగా లేదు. ఇక కరోనా దేశంలోకి ఎప్పుడు అయితే ఎంటర్ అయిందో అప్పటి నుండి భారతదేశ ప్రజలు ఎక్కువగా ఓ టీ టీ కంటెంట్ ను వీక్షించడం మొదలు పెట్టారు. దానితో ఓ టీ టీ హక్కులకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇక కొంత మంది నిర్మాతలు సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ హక్కులను అమ్మివేస్తున్నారు. అలాగే సినిమా విడుదల అయిన తర్వాత ఎన్ని రోజులకు ఆ సినిమా ఓ టీ టీ లో స్ట్రీమింగ్ కావాలో అందుకు సంబంధించిన ఒప్పందాలను కూడా చేసుకుంటున్నారు. ఇక దాదాపు చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయిన నెల రోజుల వరకు ఓ టీ టీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయి నేలలు , సంవత్సరాలు గడుస్తున్నా ఓ టీ టీ లోకి మాత్రం రావడం లేదు. అలా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఓ టీ టీ లోకి రాని కొన్ని సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ధియేటర్లలో భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా యొక్క ఓ టి టి హక్కులను సోనీ లివ్ సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఈ సంస్థ కొంత కాలం క్రితం ఈ మూవీ ని తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ లాస్ట్ మినిట్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ ఆగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. అలాగే అందుకు సంబంధించిన అప్డేట్ రావడం లేదు. తమిళ నటుడు శివ కార్తికేయన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తెలుగులో థియేటర్లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా ఏ ఓ టీ టీ లోకి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott