టాలెంట్ ఉన్న ఎంతోమంది బుల్లితెరకి ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత స్టార్స్ గా మారిపోతూ ఉంటారు. అలాంటి వారిలో చాలామంది యాంకర్స్ సైతం ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే వారిలో ముందు వరుసలో అనసూయ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందానికి అందం నటనకి నటనతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయింది అనసూయ. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. అలాగే పలు షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. అంతేకాదు పలు ఈవెంట్ల కి గెస్ట్ గా కూడా

 వస్తుంది. అయితే  తాజాగా అనసూయ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే..తాజాగా అనసూయ గురించి ఓ షాకింగ్ సీక్రెట్‌ను ఆమె ట్రైనర్ బయటపెట్టింది.  'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ఇందులో అనసూయ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ఇక, గత వారం జరిగిన ఎపిసోడ్‌లో అనసూయ కోసం ఆమె కాలేజ్‌లో వర్క్ చేసిన ట్రైనింగ్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూడగానే సర్‌ప్రైజ్ అయిపోయింది. తర్వాత ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయింది.  'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ

 గర్ల్స్' షోలో అనసూయ కాలేజ్ ట్రైనింగ్ ఆఫీసర్.. 'అనసూయను నేను ఎంతో స్ట్రిక్ట్‌గా చూసుకున్నాను. సుశాంక్‌ను, ఈమెను విడగొట్టాలని చాలా ప్లాన్ చేశాను' అని చెప్పుకొచ్చారు. తర్వాత అనసూయ మాట్లాడుతూ.. 'ఈ మేడం వల్లే మా ఇద్దరికీ ఆ సమయంలో ఫొటోలు దిగే అవకాశం కూడా రాలేదు' అని చెప్పింది. అలా ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: